Turkey: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ‘‘కాశ్మీర్’’ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తారు. పలు సందర్భాల్లో ఎర్డోగాన్ భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడారు. తాజాగా, మరోసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ( UNGA ) వార్షిక సమావేశంలో కూడా కాశ్మీర్ అంశంపై మాట్లాడారు. ‘‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, మా కాశ్మీరీ సోదరులు, సోదరీమణుల ఆకాంక్షల ఆధారంగా సంభాషణ ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని మేము సమర్థిస్తున్నాము’’ అని అన్నారు.
Read Also: High Court: “ఇది అమెరికా కాదు.. భారత్”.. హైకోర్టులో ఎక్స్(ట్వీటర్)కు భారీ ఎదురుదెబ్బ..!
ఈ విషయంలో భారత్ తమ వైఖరిని చాలా స్పష్టంగా టర్కీకి తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్ అంశం భారత్ అంతర్గత సమస్య అని పదే పదే చెప్పింది. అయినా కూడా టర్కీ అధ్యక్షుడు వీటిని పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ పర్యటన తర్వాత ఎర్డోగాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2019 నుంచి ప్రతీ UNGA ప్రసంగాలలో ఎర్డోగన్ నిరంతరం కాశ్మీర్‌ను హైలైట్ చేస్తూ, పాకిస్తాన్‌తో సంఘీభావం తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే, ఎర్డోగాన్ ఇజ్రాయిల్, దాని మిత్ర దేశాలను టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దానిని ఖండించారు. ఇది మరణహోం, జీవిత విధ్వంసంగా పేర్కొన్నాడు. గాజాలో అమాయకపు ప్రజలు మరణిస్తున్నారని, పాలస్తీనియన్ల వైపు నిలబడాల్సిన రోజు వచ్చిందని చెప్పారు. సిరియా, ఇరాన్, లెబనాన్, ఖతార్‌లలో ఇజ్రాయిల్ దాడుల్ని ఆయన ఖండించారు.
