సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఫోర్జరీ కేసులో దూకుడు పెంచిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది.. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మూలాలకు చెందిన ఇద్దరు బడా వ్యాపారులను అరెస్ట్ చేసింది ఈడీ.. వీరిలో ఒకరు శరత్ చంద్రారెడ్డి కాగా.. మరొకరు వినయ్‌బాబు.. నిందితుడు శరత్‌రెడ్డికి కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మూలాల ప్రకారం అరబిందో ఫార్మా అనే కంపెనీకి శరత్ రెడ్డి నేతృత్వం వహిస్తుండగా.. ఆ సంస్థ అధినేతగా వినయ్ బాబు అన్నారు..
Read Also: Earthquake: వణికిస్తోన్న వరుస భూకంపాలు.. తెల్లవారుజామున అండమాన్‌లో భూప్రకంపనలు
అయితే ఈ కేసులో సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూప్ డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు శరత్ చంద్రారెడ్డి.. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్కొంది సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించారు శరత్ చంద్రారెడ్డి.. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.