పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కత్తితో రెచ్చిపోయాడు. సెలవు నిరాకరించారని కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో నలుగురు సహోద్యోగులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: UGC: 18 వైద్య కాలేజీలపై యూజీసీ కొరడా.. షోకాజ్ నోటీసులు జారీ
అమిత్ సర్కార్ అనే వ్యక్తి ప్రభుత్వోద్యోగి. కోల్‌కతాలోని న్యూ టౌన్ టెక్నికల్ బిల్డింగ్‌లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే సెలవు విషయంలో ఆఫీసులో ఘర్షణ చోటుచేసుకుంది. అయితే అతడు కత్తి తీసుకుని నలుగురు సహోద్యోగులను పొడిచాడు. దీంతో బాధితులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారు. తన తండ్రి గురించి జోకులు వేయడంతోనే పొడిచినట్లుగా నిందితుడు తెలిపారు. అంతేకాకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Elections: ఆప్ అంచనాలు తల్లకిందులవుతున్నాయా? దానికి కారణమిదేనా?