NTV Telugu Site icon

Wayanad landslides: ముగిసిన సహాయ చర్యలు.. ఆర్మీకి ఘనంగా వీడ్కోలు

Wayanadlandslides

Wayanadlandslides

కేరళలోని వయనాడ్‌లో జరిగిన విపత్తు తర్వాత ఇండియన్ ఆర్మీ చేసిన సాహసాలను ఎవ్వరూ మరిచిపోవడం లేదు. ప్రాణాలను తెగించి సహాయ చర్యలు పాల్గొన్నారు. అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బురదలో కూరుకుపోయారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి 400 మందికి పైగా మృతదేహాలను వెలికితీయగా.. ఇంకొందరిని రక్షించారు. వందలాది మంది ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. దాదాపు 10 రోజుల పాటు సైన్యం సహాయ చర్యల్లో పాల్గొన్నారు. గురువారం రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో ఆర్మీ తిరిగి తమ ప్రాంతాలకు బయల్దేరారు. దీంతో ప్రజలు.. జవాన్లకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురువారం సహాయక చర్యలు ముగియడంతో జవాన్లు తిరుగు పయనం అయ్యారు. ఈ సందర్భంగా జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వయనాడ్‌ ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. జవాన్లు వెళ్తుండగా ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.