Site icon NTV Telugu

Elon Musk: ఎలాన్ మస్క్ కొడుకు పేరులో ‘చంద్రశేఖర్’..

Elon Musk

Elon Musk

Elon Musk: టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన కొడుకు పేరులో ‘చంద్రశేఖర్’ అనే పేరును చేర్చారట. ఈ విషయాన్ని కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పారని మంత్రి తెలిపారు. బ్రిటన్ వేదికగా ‘గ్లోబల్ AI సేఫ్టీ సమ్మిట్’లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సమయంలో ఎలాన్ మస్క్‌తో ఫోటో దిగారు. ఎలాన్ మస్క్ తనతో చెప్పిన విషయాలను రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.

Read Also: IND vs SL: శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ.. సెమీస్కు టీమిండియా

‘చూడండి ఏఐ సదస్సులో నేను ఎవరిని కలిశానో.. శివోన్ జిలిస్-మస్క్‌కి పుట్టిన కుమారుడి పేరులో చంద్రశేఖర్ అని చేర్చారు. 1983లో నోబెల్ బహుమతి గెలుచుకున్న భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ప్రొ. ఎస్. చంద్రశేఖర్ పేరిట ఈ పేరు పెట్టినట్టు తెలిపారు’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. శాస్త్రవేత్త చంద్రశేఖర్ నక్షత్రాలు, నక్షత్రాల మరణాలు, బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన చేశారు. వీటికి గానూ ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది.

ఎలాన్ మస్క్ మరోసంస్థ న్యూరాలింక్ కంపెనీలో పనిచేస్తున్న శివోమ్ జిలిస్‌తో రిలేషన్‌షిప్ కారణంగా వీరికి 2021 నవంబర్ లో కవలలు జన్మించారు. వీరికి స్ట్రైడర్, అజూర్ అనే పేరు పెట్టారు. మస్క్‌కి తన మాజీ భార్య జస్టిన్ విల్సన్ తో ఐదుగురు పిల్లలు, కెనడియన్ సింగర్ గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మస్క్ జస్టిన్ విల్సన్, గ్రిమ్స్ తో గత సెప్టెంబర్‌లో విడిపోయారు.

Exit mobile version