Site icon NTV Telugu

Jagannath Rathyatra: జగన్నాథ రథయాత్రలో ఏనుగుల బీభత్సం.. పరుగులు తీసిన జనం

Gujarath

Gujarath

Jagannath Rathyatra: జగన్నాథ రథయాత్రలో ఏనుగుల హల్ చల్ చేశాయి. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ (జూన్ 27న) ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలోనే గుజరాత్‌లోని గోల్‌వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా జనం పైకి దాడి చేసుందుకు పరుగులు పెట్టింది.

Read Also: Amit Shah: నెక్ట్స్ తమిళనాడు సీఎం అన్నా డీఎంకే నుంచే వస్తారు.. ఈపీఎస్ను పట్టించుకోని అమిత్ షా

ఇక, ఒక ఏనుగును చూసి మరొకటి కూడా భక్తుల పైకి దాడి చేసేందుు దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. దీంతో రథయాత్ర సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానిక మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథయాత్రకు సిద్ధం చేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలు అయ్యాయి. ఆ తర్వాత గాయపడిన వారిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version