దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా.. తొలి విడతలో పోలింగ్ జరిగే గోవా, ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది.. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఈ నెల 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. అయితే, మిగతా మూడు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసిన తర్వాత మార్చి 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ పార్టీలకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
Read Also: Vaccination: 5-15 ఏళ్ల పిల్లలకు అప్పుడే.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..
ఇక, 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.. ఇక, తృణమూల్ కాంగ్రెస్, ఆప్‌తోపాటు శివసేన పార్టీలు ఎన్నికల బరిలో ఉండడం కూడా ఉత్కంఠగా మారింది.. మరోవైపు 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో కూడా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది.. అయితే ఈసారి ఆప్ కూడా ఎన్నికల బరిలో నిలిచింది. దీంతో త్రిముఖ పోటీ ఖాయం అంటున్నారు.. ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనున్న ఉత్తరాఖండ్‌లోని 70 అసెంబ్లీ స్థానాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శితో సహా పలువురు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం ముగిసింది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రియాంక గాంధీ వాద్రా వరుస ర్యాలీలు నిర్వహించారు.. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది.. భౌతిక ర్యాలీలపై నిషేధం తీవ్ర ప్రభావాన్నే చూపింది.. రాజకీయ పార్టీలు వర్చువల్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.
