Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- SIRపై ఈసీలో అంతర్గత విభేదాల చర్చ
- 2025 ఫిబ్రవరి 19 నుంచి అన్ని తుది నిర్ణయాలు ఏకగ్రీవమేనన్న ఈసీ వర్గాలు
- ఇద్దరు కమిషనర్లు 10 నెలల్లో 14సార్లు అభ్యంతరాలు చెప్పినట్లు మీడియా నివేదికతో రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలు తలెత్తాయని, ముగ్గురు కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో , 2025 ఫిబ్రవరి 19 నుంచి ఏ ఎన్నికల కమిషనర్ కూడా ఏ నిర్ణయంపైనా విభేదించలేదని ఎన్నికల సంఘం వర్గాలు గురువారం తెలిపాయి. ‘‘ఏకగ్రీవం’’గానే ప్రతీ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ తెలిపింది. మరణించిన, నకిలీ, మోసపూరిత, వేరే చోటికి వెళ్ళిపోయిన ఓటర్లను గుర్తించడం, అలాగే అర్హులైన ఓటర్లందరూ ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటమే SIR ప్రధాన లక్ష్యమని ఈసీ చెబుతోంది.
ప్రధాన ఎన్నిక కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలను మిగతా ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు తమ అంగీకారం తెలిపిన తర్వాతే చేపట్టినట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల, జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై మిగతా ఇద్దరు కమిషనర్లు 10 నెలల్లో 14 సార్లు అధికారికంగా తమ అభ్యంతరాలు తెలిపినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడం సంచలనంగా మారింది. అయితే, ఈ నివేదిక వచ్చిన వారం తర్వాత, ఇప్పుడు అన్ని నిర్ణయాలు కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్నట్లు వెల్లడైంది.
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
ఆరోపణలపై ఈసీ క్లారిటీ..
మరోవైపు, ఈసీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చింది. గోవాలో 97 మంది ఓటర్ల పేర్లు తుది ఓటర్ల జాబితాలో లేకపోవడానికి సాంకేతిక లోపమే కారణమని ఈసీ తెలిపింది. వీరిలో 88 మంది పేర్లు చేర్చినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని బేలా ఎస్టేట్‌లోని 727 మంది ఓటర్ల పేర్లు తొలగించారనిర రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందిస్తూ.. అక్కడకు బీఎల్ఓ వెళ్లిన సమయంలో ఎవరూ అందుబాటులో లేరని, దీంతో ధ్రువీకరణపై సంతకాలు తీసుకోవడంలో సమస్య ఏర్పడిందని ఈసీ వర్గాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా SIR ప్రక్రియలో దాదాపు 25,000 మంది EROలు, AEROలు పాల్గొంటున్నారని, వారిలో ఎవరూ ప్రక్రియపై ఫిర్యాదు చేయలేదని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఓటర్ల మార్పులు చేర్పులు, తొలగింపు ప్రక్రియను ఎన్నికల కమిషనర్లు వ్యక్తిగతం నిర్వహించరని, ఇది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ స్థాయిలో వికేంద్రీకృతం అవుతాయని వివరించింది.
దేశవ్యాప్తంగా నిరసనలు..
CEC జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీకి అనుకూలంగా ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతో పాటు కాక్రోచ్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై ముంబైలో అక్టోబర్ 02న సీజేపీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరికొందరు నిరసనకు దిగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయ ప్రక్రియలో ప్రతీ కమిషనర్ అభిప్రాయానికి విలువ ఉంటుంది. ముగ్గురు కమిషనర్లలో ఇద్దరు ఒప్పుకుంటేనే ఏ నిర్ణయమైనా అమలు అవుతుంది. నిజానికి CEC జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారమే లేదని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?