Site icon NTV Telugu

Digital Arrest Scam: 67 ఏళ్ల మహిళ డిజిటల్ అరెస్ట్.. రూ.14 లక్షల మోసం..

Digital Arrest Scam

Digital Arrest Scam

Digital Arrest Scam: ఇటీవల కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్స్ దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. సాక్ష్యాత్తు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ అరెస్ట్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈడీ, ఐటీ, పోలీసు డిపార్ట్‌మెంట్‌కి చెందిన అధికారుల తీరు ఫోజు కొడుతూ, అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అధికారుల వలే ఫోన్ చేసి ప్రజల్ని బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. తాజాగా ముంబైకి చెందిన 67 ఏళ్ల మహిళ డిజిటల్ అరెస్ట్ మోసానికి గురైంది. తాము అధికారులమని నమ్మించి రూ. 14 లక్షలు చెల్లించేలా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. మహిళపై మనీలాండరింగ్ కేస్ బుక్ చేసిందని భయపెడుతూ స్కామర్లు ఆమె నుంచి లక్షల్లో డబ్బు నొక్కేశారు.

Read Also: Ben Stokes: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో చోరీ.. విలువైన వస్తువులతో పాటు అవార్డు మాయం

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… సెప్టెంబర్ 1-5 మధ్య ఢిల్లీ టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి ఒక వ్యక్తి మహిళకు కాల్ చేసినట్లు చెప్పాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆధార్ కార్డ్ లింక్ చేశావని, స్కామర్లు సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కి చెందిన సిబ్బందిగా నటిస్తూ, కఠిన శిక్షలు పడుతాయంటూ మహిళను బెదిరించారు. ఆమె పేరు తొలగించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. భయంతో బాధితురాలు తన పొదుపు, పిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసి, చివరకు రూ. 14 లక్షల్ని స్కామర్లు కోరిన అకౌంట్‌లో వేసింది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డబ్బు వాపస్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, మహిళ కొడుకుకి ఈ విషయం చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Exit mobile version