NTV Telugu Site icon

Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూడీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

Eknath Shinde Takes Oath As Maharashtra Chief Minister, Fadnavis As Deputy Cm

Eknath Shinde Takes Oath As Maharashtra Chief Minister, Fadnavis As Deputy Cm

మహారాష్ట్రలో భాజపా, శివసేన సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండేతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణం చేశారు. భాజపా, శివసేన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఉద్దవ్‌ సర్కార్‌ను కుప్పకూల్చిన శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌ అవుతారకున్న షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్‌ అయ్యారు. మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేశారు.

డ్రైవర్ నుంచి సీఎంగా ఎదిగాడు..: మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్‌ షిండే స్వస్థలం సతారా. అనంతరం వీరి కుటుంబం ఠాణేలో స్థిరపడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న తనంలోనే చదువుకు దూరమైన ఆయన.. కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేసేవారు. రిక్షా, టెంపో డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లో చేరిన ఆయన క్రమక్రమంగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఠాణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఠాణే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. అలా శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే.. 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరుసగా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఠాణే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండేకు మంచి స్నేహం ఉంది. 2014లో ఫడ్నవీస్ ప్రభుత్వంలో షిండే కేబినెట్‌ మంత్రిగా కూడా పనిచేశారు.

 

Show comments