Site icon NTV Telugu

Abhijit Sen Passes Away: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్‌ కన్నుమూత

Abhijit Sen

Abhijit Sen

Abhijit Sen Passes Away: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దేశంలోనే అగ్రగామి ఆర్థిక నిపుణులలో ఆయన ఒకరు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆయనను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని, వైద్యులు ధ్రువీకరించారని ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ చెప్పారు.

Chhattisgarh: రామ్‌దాహ జలపాతంలో మునిగి ఆరుగురు పర్యాటకులు మృతి

నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. కమిషన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైస్‌ చైర్మన్‌తో పాటు అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు.

Exit mobile version