NTV Telugu Site icon

Army Commander RP Kalita: భారత్-చైనా సరిహద్దుపై ఆర్మీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు

Rana Pratap Kalita

Rana Pratap Kalita

Eastern Army Commander Rana Pratap Kalita Says LAC situation stable: భారత్, చైనా సరిహద్దు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. సరిహద్దుల్లో భ్రదత పటిష్టంగా ఉందని తూర్పు ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రానా ప్రతాప్ కలిటా అన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో.. భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1971లో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న నిర్వహించే విజయ్‌ దివస్‌ సందర్భంగా అమరవీరులకు నివాళ్లు అర్పించిన ఆయన.. ఆ తర్వాత తవాంగ్ సంఘటనపై స్పందించారు.

Viral Video: “హస్బెండ్ ఆఫ్ ది ఇయర్” ఇతనిదే.. స్టేడియంలో భార్య మేకప్‌కి హెల్ప్

వాస్తవాధీన రేఖ విషయంలో భారత్‌, చైనా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. భారత్‌లో అంతర్భాగమైన 8 ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఆర్పీ కలిటా పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకి వస్తాయని చైనా వాదిస్తోందని అన్నారు. ఇక తవాంగ్‌లో ఇరు దేశాల దళాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరు పక్షాల వారికి గాయాలు అయ్యాయని చెప్పారు. చైనా సైనికులు సరిహద్దుని దాటి, భారత్‌వైపు దూసుకురావడంతో.. స్థానిక కమాండర్లు పరిస్థితుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలోనే చిన్నపాటి ఘర్షణ జరిగిందని అన్నారు. ఈ ఘర్షణకు ముందు గానీ, ఆ తర్వాత గానీ భారత్‌ భూభాగంలోకి చైనా చొరబడలేదని స్పష్టత ఇచ్చారు.

Macharla Clashes: రణరంగంగా మారిన మాచర్ల.. వైసీపీ, టీడీపీ వర్గీయుల దాడులు, ప్రతిదాడులు

భారత్‌కు రక్షణ కల్పించేందుకు భారత సైనికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని కలిటా వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా భారత సైనికులు వెనకాడబోరని చెప్పారు. గత పది, పదిహేనేళ్ల నుంచి సరిహద్దులో రోడు, రైలు మార్గాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడంతో.. సరిహద్దులో రక్షణ మరింత బలోపేతం అవుతోందని, రక్షణ దళాలకు విధి నిర్వహణ సులభతరంగా మారిందని ఆర్పీ కలిటా తెలిపారు. కాబట్టి.. సరిహద్దు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని మరోసారి స్పష్టం చేశారు.

Show comments