NTV Telugu Site icon

Earthquake In Jammu: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు! భయాందోళనలో ప్రజలు

Earthquake Logo

Earthquake Logo

5.4 Magnitude Earthquake hits Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఈ భూకంపం వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం సంతోషించాల్సిన విషయం.

దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌, పంజాబ్‌ సహా పలు ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దాంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు.

Also Read: Honda Dio Launch: కొత్త స్కూటర్‌ని విడుదల హోండా.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

’13-06-2023న భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత: 5.4. సమయం 13:33:42 IST. లాట్: 33.15, పొడవు: 75.82, లోతు: 6 కి.మీ. దోడా, జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది. ఇక పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి. గత నెల చివరిలో ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు ఢిల్లీలో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి.