ప్రస్తుతం ప్రకృతి ప్రళయ తాండవం చేస్తుంది. ఓ వైపు తుఫాన్లు. మరో వైపు భూకంపాలు. దీనితో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుంది. వివరాలలోకి వెళ్తే శుక్రవారం గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది. అనంతరం 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చంగల్పట్టులో కూడా భూకంపం వచ్చింది. అలానే ఉదయం 8.46 గంటలకు మేఘాలయాలోని షిల్లాంగ్‌లో భూమి కంపించింది. కాగా గుజరాత్‌లోని కచ్‌లో ఉదయం 9 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపాల గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read also:Hi Nanna Vs Extra Ordinary Man: హాయ్ నాన్న- ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. సినిమాలు ఎలా ఉన్నాయంటే?
కర్ణాటక లోని విజయపురాలో 3.1గా తీవ్రతతో భూమి కంపించింది. కాగా తమిళనాడులోని చంగల్పట్టులో 3.2 తీవ్రతతో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. అలానే భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని ఎన్‌సీఎస్ వెల్లడించారు. ఇక మేఘాలయా లోని షిల్లాంగ్‌లో 3.8 తవ్రతతో భూప్రకంపన నమోదయిందని అధికారులు తెలిపారు. అలానే గుజరాత్‌లోని కచ్‌లో భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించారు. కాగా ఈ భూకంపాల వల్ల జరిగిన ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించి ఎలాంటి నివేదికలు ఇంకా అధికారులకు అదలేదు. ఈ నేపథ్యంలో ఈ భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. కాగా తుఫాను వల్ల అతలాకుతలం అవుతున్న తమిళనాడులో భూమి కంపించడంతో గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్లు ఉంది పరిస్థితి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.