NTV Telugu Site icon

EAM Jaishankar: రాహుల్ జీ అది అహంకారం కాదు…విశ్వాసం

Jai Shankar

Jai Shankar

రాహుల్ గాంధీ లండన్ లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ థింక్ ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో కేంద్రంపై, బీజేపీ సర్కార్ పై విమర్శలు చేశారు. బీజేపీ దేశంపై కిరోసిన్ జల్లిందని కేవలం ఒక నిప్పు చాలు సంక్షోభానికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విదేశాంగ శాఖ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధానం మారిందని వారు అంటున్నారు… అహంకారంతో ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ‘ ఇది అహంకారం కాదు… విశ్వాసం’ అని ఆయన రాహుల్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. దేశ ఆంకాంక్షల కోసం విదేశాంగ అధికారులు కృషి చేస్తున్నారని జైశంకర్ బదులిచ్చారు. విదేశాంగ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తారని… దేశ ప్రయోజనాల కోెసం ఇతర దేశాల వాదనలకు సమర్థవంతంగా బదులు ఇస్తారని అన్నారు.

‘ ఎస్ … భారత విదేశాంగ విధానం మారింది… ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నాం… ఇతరుల ఆర్గుమెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నాం… జాతీయ ప్రయోజనాలను కాపాడుతున్నాం… ఇది అహంకారం కాదు విశ్వాసం’ అంటూ ఘాటుగా బదులిచ్చారు జైశంకర్. లండన్ లో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం ఎవరి మాట వినడం లేదని… కాంగ్రెస్ మాత్రం ప్రజలు మాట వింటుందని చెప్పుకొచ్చారు. దేశంలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని… పరిస్థితి చేయిదాటితే సంక్షోభం ఏర్పడుతుందంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Show comments