PM Modi Gifts: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రధాని మోదీకి అందించిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన బహుమతుల ఈ-వేలాన్ని ప్రారంభించింది.నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ-వేలం నాల్గవ ఎడిషన్ రెండు వారాల పాటు నిర్వహించబడుతుంది. అక్టోబర్ 2న ముగుస్తుంది. ప్రధాని మోడీకి చెందిన బహుమతుల ఇ-వేలంలో నమోదు చేసుకోవడానికి https://pmmementos.gov.inకి వెళ్లండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో గిఫ్ట్‌లను పొందుపరిచారు. ఈ అంశాలను వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. ఈ ఏడాది సుమారు 1200 మెమెంటోలు, బహుమతి వస్తువులను ఈ-వేలంలో ఉంచారు.
వేలంలో మెమెంటోల్లో సున్నితమైన పెయింటింగ్‌లు, శిల్పాలు, హస్తకళలు, జానపద కళాఖండాలు ఉన్నాయి. వీటిలో చాలా సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, తలపాగాలు, ఉత్సవ కత్తులు వంటి బహుమతులుగా అందించబడే వస్తువులు ఉన్నాయి. అయోధ్యలోని రామమందిరం,వారణాసిలోని కాశీ-విశ్వనాథ దేవాలయం ప్రతిరూపాలు, నమూనాలు ఆసక్తిని కలిగించే ఇతర బహుమతులు ఉన్నాయి. ప్రముఖ క్రీడాకారులు అందించిన బహుమతులను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ఎడిషన్ వేలంలో 25 కొత్త క్రీడా జ్ఞాపకాలు ఉన్నాయి.
Amit Shah Convoy: అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అద్దాలు పగులగొట్టిన ఎస్పీజీ
నమామి గంగ ద్వారా దేశ జీవనాధారమైన గంగానదిని పరిరక్షించాలనే ఉదాత్తమైన లక్ష్యం కోసం తనకు అందిన కానుకలన్నీ వేలం వేయాలని నిర్ణయించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వేలం ద్వారా సేకరించిన నిధులు, జాతీయ నది అయిన గంగా నదిని పరిరక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించిన ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ అయిన నమామి గంగే కార్యక్రమానికి దోహదపడతాయి. సాధారణ ప్రజలు https://pmmementos.gov.inలో లాగిన్ చేసి నమోదు చేసుకోవడం ద్వారా ఈ-వేలంలో పాల్గొనవచ్చు.
