NTV Telugu Site icon

Delhi: మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు.. అయితే ఇది తప్పనిసరి..

Untitled 1

Untitled 1

Delhi: వ్యవసాయ రంగంలో మార్పు తేవాలని.. అంధునాతన సాంకేతిక పద్దతులను ఉపయోగించి మహిళలు వ్యవసాయం చేసేలా మహిళలకు అగ్రికల్చర్ డ్రోన్లను అందించి.. ఉపాధిని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో చెప్తుంది. మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని.. వాళ్లకు మరింత చేయూతనిచ్చి బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గతంలో మోడీ ఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్నట్టుగానే అగ్రి కల్చర్ డ్రోన్ ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించేందుకు.. అలానే వాళ్ళు రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమ్ ను రోపొందించింది కేంద్రం.

Read also:Salman Khan: సల్లూ భాయ్ ఏ దేశమైనా పారిపో.. కానీ లేపేస్తాం?

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం అయ్యింది. ఆ సమావేశంలో ఈ స్కీమ్‌‌కు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన కేంద్రం.. 2023- 24 నుంచి 2025-26 మధ్య కాలంలో 15,000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించనున్నట్లు తెలిపింది. కాగా ఈ స్కీమ్ కోసం రూ. 1,261 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. కాగా ఈ పథకం కింద గరిష్టంగా రూ. 8 లక్షల మేర 80% ఆర్థిక సహాయాన్ని అందించనుంది కేంద్రం. అయితే డ్రోన్ పొందిన వాళ్లకి 5 రోజుల పాటు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి. ఆ తర్వాత మరో 10 రోజుల పాటు డ్రోన్ల ద్వారా వ్యవసాయ సేవలపై శిక్షణ అందిస్తారు.