Site icon NTV Telugu

DRDO-Army: యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

Drdoarmy Successfully Test

Drdoarmy Successfully Test

రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీఆర్‌డీవో, ఆర్మీ సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌లో క్షిపణి, లాంచర్, టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: Vizag MLC Election: ముగిసిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు.. బరిలో ఇద్దరే..!

ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి లేదా ఏటీజీఎం వ్యవస్థ పగలు మరియు రాత్రి రెండింటినీ.. అలాగే అత్యుత్తమ దాడి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. డ్యూయల్ మోడ్ సీకర్ ఫంక్షనాలిటీ ట్యాంక్ వార్‌ఫేర్ కోసం క్షిపణి సామర్థ్యానికి విలువ పెంచుతుందని అధికారులు తెలిపారు.

క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. డీఆర్‌డీవో, ఆర్మీని అభినందించారు. అధునాతన సాంకేతికత ఆధారిత రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో స్వావలంబన సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.

Exit mobile version