New Year’s Day 2026: కొత్త సంవత్సరం రోజు ఈ తప్పులు చేయొద్దు.. ఏడాది పొడవునా చిక్కుల్లో పడొద్దు..!
- నూతన సంవత్సరం అంటే కేవలం తేదీ మార్పు కాదు..
- కొత్త ప్రారంభాలు, ఆలోచనలు.. సానుకూల మార్పులకు సమయం..
- ఏడాది ఆరంభంలో తీసుకునే చర్యలు మొత్తం ఏడాదిపై ప్రభావం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Year’s Day 2026: కాలం వేగంగా పరిగెత్తుతుంది.. నెలలు, సంవత్సరాలు.. ఇలా మారుతూనే ఉన్నాయి.. అయితే, నూతన సంవత్సరం అంటే కేవలం తేదీ మార్పు కాదు.. ఇది కొత్త ప్రారంభాలు, కొత్త ఆలోచనలు.. సానుకూల మార్పులకు సమయంగా తీసుకోవాలి.. ఓ టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగాలి.. ఇది సాధిస్తాను అనే గోల్ పెట్టుకోవాలి.. ఓ మార్పునకు శ్రీకారం చుట్టాలని అని పెద్దలు చెబుతారు.. ఇక, మతపరమైన మరియు జ్యోతిష్యశాస్త్ర నమ్మకాల ప్రకారం, సంవత్సరంలో మొదటి రోజున తీసుకునే చర్యలు మొత్తం సంవత్సరంపై ప్రభావం చూపుతాయి అని నమ్ముతారు.. అందువల్ల, నూతన సంవత్సరాన్ని ఆలోచనాత్మకంగా ప్రారంభించడం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఆ రోజున జరిగే చిన్న పొరపాటు కూడా ఆ తర్వాత ఆర్థిక, మానసిక, కుటుంబ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు..
* కొత్త ఏడాది ఆరంభమైన తొలి రోజున ఆర్థిక తప్పులు చేయొద్దు.. సంవత్సరం మొదటి రోజున ఆర్థిక లావాదేవీలు చేయడం లేదా డబ్బు అప్పుగా తీసుకోవడం శుభప్రదం కాదని ఓ నమ్మకం.. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి, లేదా మీరే అప్పుగా తీసుకోకండి, ఎందుకంటే ఇది ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని జ్యోతిష్య శాస్త్రం నమ్మకాలు చెబుతున్నాయి..
Also Read
* నూతన సంవత్సరం గొడవ లేదా కఠినమైన మాటలతో ప్రారంభమైతే, అది ఏడాది పొడవునా మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అని హెచ్చరిస్తున్నారు.. కాబట్టి, ఎలాంటి ఘర్షణలను తావివ్వకూడదని.. శాంతి మరియు సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించాలని చూస్తున్నారు.
*మత విశ్వాసాల ప్రకారం, నూతన సంవత్సరం మొదటి రోజున చిరిగిన, పాత లేదా నల్లని దుస్తులు ధరించడం శుభం కాదని.. ఇది అశుభంగా భావిస్తారు. ఈ రోజున శుభ్రమైన, లేత రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానిస్తుందని చెబుతున్నారు.
* కొత్త సంవత్సర రోజున ఆలస్యంగా నిద్రపోవడం లేదా సోమరితనం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.. బ్రహ్మ ముహూర్తం సమయంలో మేల్కొని, స్నానం చేసి, దేవుడిని ధ్యానించి, రోజును సానుకూల భావాలతో ప్రారంభించండి, సంపన్నమైన సంవత్సరాన్ని చూస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు..
* నూతన సంవత్సరం రోజు ప్రారంభంలో ప్రతికూల వార్తలు లేదా వివాదాస్పద అంశాలను నివారించండి . ఇది మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి మరియు సంవత్సరం పొడవునా సానుకూల దృక్పథాన్ని కొనసాగించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు.
* సంవత్సరం ఆరంభం రోజు తేలికైన మరియు పోషకమైన భోజనం తినడం ద్వారా సంవత్సరాన్ని ప్రారంభించండి. ఉపవాసం లేదా తేలికపాటి భోజనం తినడం కూడా ఏడాది పొడవునా ఆరోగ్యం మరియు శక్తికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని సూచిస్తున్నారు.. అయితే, ఇవి నమ్మేవారు కొందరు అయితే.. అదంతా వట్టిదే అని కొట్టిపారేసేశారు లేకపోలేదు..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?