Site icon NTV Telugu

New Year’s Day 2026: కొత్త సంవత్సరం రోజు ఈ తప్పులు చేయొద్దు.. ఏడాది పొడవునా చిక్కుల్లో పడొద్దు..!

New Year's Day 2026

New Year's Day 2026

New Year’s Day 2026: కాలం వేగంగా పరిగెత్తుతుంది.. నెలలు, సంవత్సరాలు.. ఇలా మారుతూనే ఉన్నాయి.. అయితే, నూతన సంవత్సరం అంటే కేవలం తేదీ మార్పు కాదు.. ఇది కొత్త ప్రారంభాలు, కొత్త ఆలోచనలు.. సానుకూల మార్పులకు సమయంగా తీసుకోవాలి.. ఓ టార్గెట్‌ పెట్టుకుని ముందుకు సాగాలి.. ఇది సాధిస్తాను అనే గోల్‌ పెట్టుకోవాలి.. ఓ మార్పునకు శ్రీకారం చుట్టాలని అని పెద్దలు చెబుతారు.. ఇక, మతపరమైన మరియు జ్యోతిష్యశాస్త్ర నమ్మకాల ప్రకారం, సంవత్సరంలో మొదటి రోజున తీసుకునే చర్యలు మొత్తం సంవత్సరంపై ప్రభావం చూపుతాయి అని నమ్ముతారు.. అందువల్ల, నూతన సంవత్సరాన్ని ఆలోచనాత్మకంగా ప్రారంభించడం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఆ రోజున జరిగే చిన్న పొరపాటు కూడా ఆ తర్వాత ఆర్థిక, మానసిక, కుటుంబ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు..

* కొత్త ఏడాది ఆరంభమైన తొలి రోజున ఆర్థిక తప్పులు చేయొద్దు.. సంవత్సరం మొదటి రోజున ఆర్థిక లావాదేవీలు చేయడం లేదా డబ్బు అప్పుగా తీసుకోవడం శుభప్రదం కాదని ఓ నమ్మకం.. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి, లేదా మీరే అప్పుగా తీసుకోకండి, ఎందుకంటే ఇది ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని జ్యోతిష్య శాస్త్రం నమ్మకాలు చెబుతున్నాయి..

* నూతన సంవత్సరం గొడవ లేదా కఠినమైన మాటలతో ప్రారంభమైతే, అది ఏడాది పొడవునా మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది అని హెచ్చరిస్తున్నారు.. కాబట్టి, ఎలాంటి ఘర్షణలను తావివ్వకూడదని.. శాంతి మరియు సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించాలని చూస్తున్నారు.

*మత విశ్వాసాల ప్రకారం, నూతన సంవత్సరం మొదటి రోజున చిరిగిన, పాత లేదా నల్లని దుస్తులు ధరించడం శుభం కాదని.. ఇది అశుభంగా భావిస్తారు. ఈ రోజున శుభ్రమైన, లేత రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానిస్తుందని చెబుతున్నారు.

* కొత్త సంవత్సర రోజున ఆలస్యంగా నిద్రపోవడం లేదా సోమరితనం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.. బ్రహ్మ ముహూర్తం సమయంలో మేల్కొని, స్నానం చేసి, దేవుడిని ధ్యానించి, రోజును సానుకూల భావాలతో ప్రారంభించండి, సంపన్నమైన సంవత్సరాన్ని చూస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు..

* నూతన సంవత్సరం రోజు ప్రారంభంలో ప్రతికూల వార్తలు లేదా వివాదాస్పద అంశాలను నివారించండి . ఇది మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి మరియు సంవత్సరం పొడవునా సానుకూల దృక్పథాన్ని కొనసాగించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు.

* సంవత్సరం ఆరంభం రోజు తేలికైన మరియు పోషకమైన భోజనం తినడం ద్వారా సంవత్సరాన్ని ప్రారంభించండి. ఉపవాసం లేదా తేలికపాటి భోజనం తినడం కూడా ఏడాది పొడవునా ఆరోగ్యం మరియు శక్తికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని సూచిస్తున్నారు.. అయితే, ఇవి నమ్మేవారు కొందరు అయితే.. అదంతా వట్టిదే అని కొట్టిపారేసేశారు లేకపోలేదు..

Exit mobile version