కరోనా వైరస్.. భారతదేశంలో ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపి వెళ్లిందో అందరికీ తెలిసిందే. ఇంకా చాలా కుటుంబాల్లో ఆ దు:ఖ సమయాలు పోలేదు. గత కొంతకాలంగా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ వైరస్ తాజాగా మరోసారి విజృంభిస్తోంది. అయితే ఓ సీనియర్ సర్జన్‌కు సంబంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోవిడ్ రోగిని చంపేయండి అంటూ జూనియర్‌తో అన్న మాటలు ట్రెండింగ్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Off The Record: అరెస్ట్ అనేది జరిగితే.. చేసేది సిట్టా? ఈడీనా?
2021లో కోవిడ్ మహమ్మారి అనేక మంది ప్రాణాలు తీసుకుంది. ఆ సమయంలో కోవిడ్-19 రోగిని చంపేయండి అంటూ సహోద్యోగికి సూచించిన ఆడియో క్లిప్ ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది. దీంతో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ వైద్యుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఇది కూడా చదవండి: Etala Rajender : “ఆనాడు మీరు చేసిందేంటి?”.. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?
నిందితుడు లాతూర్‌లోని ఉద్గిర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడు అదనపు జిల్లా సర్జన్‌గా పని చేసిన శశికాంత్ దేశ్‌పాండేగా పోలీసులు గుర్తించారు. డాక్టర్ శశికాంత్-జూనియర్ వైద్యుడు డాంగే మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో రోగులు ఎక్కువైపోవడం, వనరులు లేకపోవడంతో రోగిని చంపేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎవరినీ లోపలికి వెళ్లనివ్వకండి.. ఆ మహిళా రోగి కౌసర్ ఫాతిమాను చంపేయండి అంటూ సూచించారు. ప్రస్తుతం ఆ రోగి కోలుకుని క్షేమంగా ఉన్నారు.
కౌసర్ ఫాతిమా.. దయామి అజిమోద్దీన్ గౌసోద్దీన్ భార్య.. ఉద్దిర్ నగర పోలీసులకు మే 24న దేశ్‌పాండేపై గౌసోద్దీన్ ఫిర్యాదు చేశాడు. మతపరమైన భావాలను రెచ్చగొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ద్వేషపూరిత, ఇతర అనేక నేరాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. పోలీసులు.. డాక్టర్ దేశ్‌పాండే మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. అతనికి నోటీసు జారీ చేశారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ దిలీప్ గాడే తెలిపారు. ఇక జూనియర్ డాక్టర్ డాంగేకు కూడా నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లా వెలువల ఉండడంతో రేపు వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అతని మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తామని తెలిపారు.
2021లో కోవిడ్ సమయంలో కౌసర్ ఫాతిమా 10 రోజులుగా చికిత్స పొందుతోంది. ఆమె చేరిన ఏడవ రోజున ఆమె భర్త గౌసోద్దీన్.. జూనియర్ డాక్డర్ డాంగే పక్కన కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో దేశ్‌పాండే నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ స్పీకర్ ఆన్‌లో ఉంది. ఆస్పత్రి గురించి ఆరా తీశారు. బెడ్‌లు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పడకలు ఖాళీగా లేవని డాంగే బదులిచ్చాడు. దీంతో దయామికి చెందిన రోగిని చంపేయండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా సంభాషణలో కుల ఆధారిత దూషణకు దిగాడు. ఈ వ్యాఖ్యలు విన్న రోగి భర్త తీవ్ర ఆవేదన చెందాడు.
డాక్టర్ వ్యాఖ్యలతో షాక్ అయ్యానని ఫిర్యాదుదారుడు గౌసోద్దీన్ వాపోయాడు. తన భార్య ఇంకా చికిత్స పొందుతున్నందున ఆ సమయంలో మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత తన భార్య కోలుకుని డిశ్చార్జ్ అయిందని తెలిపారు.
ఇక డాక్టర్ దేశ్‌పాండే మాట్లాడిన ఆడియో క్లిప్ మే 2, 2025న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డాక్టర్ వ్యాఖ్యలు మనసును కలత పెట్టాయని.. అంతేకాకుండా తీవ్రంగా బాధించిందని.. మత పరమైన వ్యాఖ్యలు చేయడం అవమానించినట్లు అయిందని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గౌసోద్దీన్ చెప్పాడు.
