DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
- కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..
- వందల కోట్ల ఆస్తులు ఆయన సొంతం..
- షాపింగ్ మాల్స్ నుంచి షేర్స్ వరకు కోట్ల వ్యాపారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: ఎట్టకేలకు కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. సీఎంగా ఉన్న సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. అయితే, ఇప్పుడు డీకే శివకుమార్ ఆస్తుల గురించి చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి బిగ్ ఫండర్గా ఉన్న వ్యక్తుల్లో్ డీకే ఒకరు. దేశంలోనే అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో డీకే శివకుమార్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు . ఆయన తన నికర ఆస్తి విలువ రూ. 1,400 కోట్లకు పైగా ఉందని పేర్కొన్నారు. ఆయనకు షాపింగ్ మాల్స్, ఇతర ఖరీదైన వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా, ఆయన స్టాక్ మార్కెట్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు.
Also Read
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
Myneta.comలో అప్లోడ్ చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన తన కుటుంబం ఆస్తులు రూ. 1413 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అప్పులు రూ. 503 కోట్లు ఉన్నట్లు చెప్పారు. డీకేతో పాటు ఆయన కుటుంబీకులకు వివిధ బ్యాంకుల్లో రూ. 16 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన చరాస్తులు రూ. 244 కోట్లకు పైగా, తన కుటుంబ ఆస్తులు రూ. 273 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. డీకే స్థిరాస్తులు రూ. 970 కోట్లుగా చెప్పారు.
ఇదే కాకుండా షేర్లు, స్టాక్ మార్కెట్లో కోట్ల పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. అనేక కంపెనీల్లో రూ. 4.20 కోట్ల పెట్టుబడులు, రూ. 9 కోట్ల విలువైన ఎఫ్డీలు, బంగారం, వెండి, వజ్రాల వంటి విలువైన వస్తులు ఉన్నాయి. లక్షల విలువైన రోలెక్స్ , హుబ్లోట్ వాచీలు ఉన్నాయి. డీకే శివకుమార్, ఆయన భార్య, పిల్లలకు ఉన్న ఆభరణాల మొత్తం విలువ 3.82 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
డీకే భార్యకు రూ. 30 కోట్ల వ్యవసాయ భూమి, దీనితో పాటు ఢిల్లీ, బెంగళూర్‌లో పలు ప్రాంతాల్లో రూ. 84 కోట్ల పైగా విలువైన ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. ఆయనకు రూ. 900 కోట్ల విలువైన గ్లోబల్ మాల్ ఉంది. కోట్ల విలువైన దుకాణాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!