Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్‌.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్‌ బుకింగ్‌

Train

Train

Special Trains: పండుగ సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వేశాఖ.. దీపావళి, ఛత్‌ పండుగల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక ఏర్పాట్లు చేస్తోంది. పండుగల సమయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల నుంచి బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ తదితర ప్రాంతాలకు భారీగా ప్రయాణికుల రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే పలు పండుగ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ఏడాది దీపావళి నవంబర్‌ 8న జరగనుంది. రైల్వే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీ మినహా 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ విండో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. డిమాండ్‌ ఎక్కువగా ఉండే రైళ్లలో సీట్లు త్వరగా నిండిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే బుకింగ్‌ చేసుకోవడం మంచిది.

ఈ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం

ఢిల్లీ-పాట్నా, పాట్నా-అహ్మదాబాద్‌, పాట్నా-ఉధ్నా, ముంబై-పాట్నా, హౌరా-పాట్నా, బెంగళూరు-పాట్నా, ఫిరోజ్‌పూర్‌-పాట్నా, వారణాసి-ఢిల్లీ, కాన్పూర్‌-ఢిల్లీ, లుధియానా-సుపాల్‌, లుధియానా-పాట్నా, చెన్నై-పాట్నా, హైదరాబాద్‌-పాట్నా, ఢిల్లీ-గోరఖ్‌పూర్‌ మార్గాల్లో పండుగల సమయంలో రద్దీ పెరిగే అవకాశం ఉంది.

20 ప్రత్యేక రైళ్ల జాబితా

09189/09190- ముంబై సెంట్రల్–కటిహార్–ముంబై సెంట్రల్ (77 అదనపు ట్రిప్పులు)
04127/04128- కాన్పూర్ సెంట్రల్–గౌహతి–కాన్పూర్ సెంట్రల్ (14)
05736/05735- కటిహార్–అమృత్‌సర్–కటిహార్ (12)
05932/05931 – దిబ్రూగఢ్–కోల్‌కతా–దిబ్రూగఢ్ (13)
04209/04210 – వారణాసి–న్యూఢిల్లీ–వారణాసి (50)
04213/04214 – అయోధ్య కాంట్–ఆనంద్ విహార్ టెర్మినల్–అయోధ్య కాంట్ (36)
04512/04511 – చండీగఢ్–పాట్నా జంక్షన్–చండీగఢ్ – (18)
04616/04615 – ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్–పాట్నా జంక్షన్–ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ (16)
04008/04007 – ఆనంద్ విహార్ టెర్మినల్–జోగ్బాని–ఆనంద్ విహార్ టెర్మినల్ (10)
04028/04027- ఆనంద్ విహార్ టెర్మినల్–ముజఫర్‌పూర్–ఆనంద్ విహార్ టెర్మినల్ – (26)
04010/04009 – ఢిల్లీ జంక్షన్–సీతామర్హి–ఢిల్లీ జంక్షన్ (12)
02456/02455 – న్యూఢిల్లీ–కాన్పూర్ సెంట్రల్–న్యూఢిల్లీ (98)
02563/02564 – బరౌనీ–న్యూఢిల్లీ–బరౌనీ స్పెషల్
02569/02570 – దర్భంగా–న్యూఢిల్లీ–దర్భంగా స్పెషల్
04014/04013 – ఆనంద్ విహార్ టెర్మినల్–లౌకాహా బజార్–ఆనంద్ విహార్ టెర్మినల్ (150)
04002/04001 – హజ్రత్ నిజాముద్దీన్–దాదర్–హజ్రత్ నిజాముద్దీన్ (14)
04227/04228 – వారణాసి–చండీగఢ్–వారణాసి (36)
02458/02457 – ఆనంద్ విహార్ టెర్మినల్–కాన్పూర్ సెంట్రల్–ఆనంద్ విహార్ టెర్మినల్ (72)
04314/04313 – యోగా సిటీ రిషికేశ్–ముజఫర్‌పూర్–యోగా సిటీ రిషికేశ్ (18)
04096/04095 – ఆనంద్ విహార్ టెర్మినల్–పట్లీపుత్ర–ఆనంద్ విహార్ టెర్మినల్ (120)

టికెట్‌ బుకింగ్‌లో ఈ జాగ్రత్తలు

కన్ఫర్మ్‌ టికెట్‌ పొందాలనుకునే ప్రయాణికులు ముందుగానే ప్రయాణ తేదీని నిర్ణయించుకోవాలి. రిజర్వేషన్‌ ప్రారంభానికి ముందే IRCTCలో ప్రయాణికుల పేర్లు, వయస్సు, బెర్త్‌ వివరాలతో మాస్టర్‌ లిస్ట్‌ను సిద్ధం చేసుకోవడం ఉపయోగకరం. బుకింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి ముందుగానే లాగిన్‌ అవ్వాలి. వేగంగా చెల్లింపు చేసేందుకు అందుబాటులో ఉన్న చెల్లింపు సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు రైలు నంబర్‌, ప్రయాణ తేదీ, ఎక్కే స్టేషన్‌, గమ్యస్థానం వంటి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రయాణానికి ముందు రైలు షెడ్యూల్‌, సీట్ల లభ్యతను మరోసారి తనిఖీ చేసుకోవడం మంచిది. సాధారణ రైళ్లలో సీట్లు దొరకని వారికి ఈ ప్రత్యేక రైళ్లు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. రైల్వే సేవలు, ఫిర్యాదులు, ప్రయాణ సమాచారానికి 139 హెల్ప్‌లైన్‌, NTES సేవలను ఉపయోగించుకోవచ్చు.