HD Kumaraswamy: జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.
ఈ మ్యాచ్‌లో మీరు పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చారా..? లేక ఆస్ట్రేలియాకు మద్దతు ఇచ్చారా..? అని సెటైర్లు వేశారు. ప్రజలు ప్రభుత్వంలో అవినీతి గురించి మాట్లాడుతుకుంటున్నారని అన్నారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. పర్సంటేజీలు, అవినీతిపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేం చెప్పినట్లు చేశామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని కుమారస్వామి అన్నారు.
రాష్ట్రప్రభుత్వం, కేంద్రం సహాయం కోసం లేఖలు రాసింది, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేంద్రాన్ని కలవాలని ప్రభుత్వానికి సూచించారు. కొన్ని జిల్లాల్లో నీటి కొరత ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇరు పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.