NTV Telugu Site icon

Pushkar Singh Dhami: పోలీసులు సజీవ దహనానికి ప్రయత్నించారు.. వారిని వదిలిపెట్టేది లేదు..

Pushkar Sing Dhami

Pushkar Sing Dhami

Pushkar Sing Dhami: ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని బన్‌భూల్‌పురా అక్రమ మదర్సా కూల్చివేత తీవ్రమైన అల్లర్లకు కారణమైంది. కూల్చివేత సమయంలో ఆ ప్రాంతంలోని వ్యక్తులు అల్లర్లకు పాల్పడటమే కాకుండా, పోలీసులపై, జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. 100కు పైగా మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లకు కారణమైన ప్రధాన నిందితుల కోసం పోలీసులు, నిఘా వర్గాలు వేట కొనసాగిస్తున్నాయి.

Read Also: Aishwarya Rajinikanth: ధనుష్ తో విడాకులు.. రెండేళ్ల నుంచి సేఫ్ గా ఉన్నా

హల్ద్వానీ ఘర్షణల్లో పాల్గొన్న నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం అన్నారు. చంపావత్ జిల్లాలోని లోహాఘాట్‌కు వెళ్లిన రెండో రోజున, మిస్టర్ ధామీ విద్యార్థులు, యువతను కలుసుకుని, సంజు-2024 కార్యక్రమానికి ముందు వారిని ప్రోత్సహించారు. ఆయన మాట్లాడుతూ.. హల్ద్వానీ అల్లర్లలో మహిళా పోలీస్ అధికారులు, మీడియా సిబ్బందితో దుర్మార్గులు అనుచితంగా ప్రవర్తించారని, వారిని సజీవ దహనం చేయడానికి యత్నించారని, దేవభూమి(ఉత్తరాఖండ్) ప్రతిష్టను దిగజార్చేందుకు తాను అనుమతించనని, దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.

అంతకుముందు శుక్రవారం.. సీఎం ధామి హల్ద్వానీలో పర్యటించారు. గాయపడిన మహిళా పోలీస్ సిబ్బంది, ఇతర అధికారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి వీడియో ఫుటేజీలు మొత్తం ఉన్నాయని, ఈ ఘటనలో నిందితులందర్ని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలైందని చెప్పారు.