కరోనా డెల్టా వేరియంట్ ఉధృతి ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తోంది. సెకండ్ వేవ్ నెమ్మదించినా.. రోజువారీ కేసుల శాతం తక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి వేగం తీవ్రతను తెలియజేసే ఆర్- ఫ్యాక్టర్ అధికంగా ఉండటంతో అన్ని రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి తలెత్తింది.
read also : అలర్ట్ : మరో మూడు రోజుల పాటు వర్షాలు
కేసులు పెరుగుతుండటంతో మణిపూర్ పది రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. పొరుగునున్న మిజోరంలో ఆదివారం రాత్రి నుంచి 24 వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తోంది.త్రిపుర రాజధాని అగర్తలా సహా 11 మున్సిపాలిటీల్లో నేటి నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు వారం పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా, మణిపూర్, అరుణాచల్, త్రిపురల్లో కేసులు అధికంగా వస్తున్నాయి. మణిపూర్, త్రిపుర, అరుణాచల్‌లో ఆర్ ఫ్యాక్టర్ 1 శాతం పైనే ఉంది. మేఘాలయ, మిజోరం , సిక్కిం, సహా పలు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ రేటు ఆందోళన కలిగిస్తోంది.
