Site icon NTV Telugu

డెల్టాప్ల‌స్ అల‌ర్ట్ః మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు…

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా డెల్టాప్ల‌ప్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టంతో రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.  దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ ప్ర‌ధాన కార‌ణం అయింది.  ఈ వేరియంట్ కార‌ణంగానే కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌య్యాయి.  ఇక‌పోతే,  ఇప్పుడు దేశాన్ని డెల్టాప్ల‌స్ వేరియంట్ భ‌య‌పెడుతున్న‌ది.  ఇప్ప‌టికైతే ఈ వేరియంట్ కేసులు త‌క్కువ‌గా న‌మోదైతున్న‌ప్ప‌టికీ, రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ నుంచి థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  

Read: బికినీలో బాలీవుడ్ బార్బీ హాట్ ట్రీట్

మ‌హారాష్ట్ర‌లో ఈ వేరియంట్ కు సంబందించి ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయి.  దీంతో ఆ రాష్ట్రంలో తిరిగి క‌ఠిన ఆంక్ష‌లు విధించింది.  సాయంత్రం 4 గంట‌ల వ‌రకే రాష్ట్రంలో దుకాణాల‌కు అనుమ‌తి ఇచ్చింది థాక‌రే స‌ర్కార్‌.  మొద‌టి, రెండో వేవ్ ల కార‌ణంగా అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు న‌మోదైన రాష్ట్రంగా మ‌హారాష్ట్ర ఉన్న‌ది.  రెండు వేవ్‌ల నుంచి నెర్చుకున్న అనుభ‌వాల దృష్ట్యా స‌ర్కార్ మూడో వేవ్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఇప్ప‌టి నుంచే చ‌ర్య‌లు తీసుకోవ‌డం మొద‌లుపెట్టింది. 

Exit mobile version