రెండోదశ కరోనా నుంచి కోలుకోక ముందే థర్డ్ వేవ్ భయపెడుతున్నది. కొన్ని దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైంది. బ్రిటన్‌లో కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. బ్రిటన్‌తో పాటుగా అటు యూరప్, అఫ్రికా, అమెరికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. డెల్టా వేరియంట్ నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకుంటే ఈ డెల్టా వేరియంట్ నుంచి కొంతమేర బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అటు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
Read: గుడ్ న్యూస్ : భారత్‌లోకి త్వరలో ఫైజర్ టీకా
ఈ డెల్టా వేరియంట్ ఇప్పటికే 80 దేశాల్లో వ్యాపించింది. ఇటు ఇండియాలో డెల్టా ప్లస్ వేరియట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కేసులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో 22 కేసులు నమోదుకావడంలో డెల్టా ప్లస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఇండియా కూడా చేరింది. ఇండియాలో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇండియాలో 22 డెల్టా వేరియంట్ కేసులు నమోదు కావడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాలక కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.
