Site icon NTV Telugu

AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో షాకింగ్ ఘటన.. యూత్ కాంగ్రెస్ హల్‌చల్

Ai

Ai

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హఠాత్తుగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు లోపలికి ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. చొక్కాలు విప్పి హల్‌చల్ చేశారు. అమెరికాతో ట్రేడ్‌ డీల్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంతో నిర్వాహకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు భారత్ మండపంలో ఏఐ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి అతిథులు వచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా అనేక దేశాధినేతలు పాల్గొన్నారు.

అయితే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐ సమ్మిట్‌ను విమర్శించారు. ‘‘అస్తవ్యస్తమైన ప్రజా సంబంధాల ప్రదర్శన’’ అని అభివర్ణించారు. చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తీవ్రంగా తప్పుపట్టారు.

Exit mobile version