Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
- దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలకు అనుమతి ఇవ్వొద్దు..
- కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యాపారుల లేఖ..
- పండగ సమయంలో వ్యాపారాలు నష్టపోతున్నాయని ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Protest: వరస నిరసనల కారణంగా ఢిల్లీలోని వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), ఇతర రాజకీయ పార్టీలు నిరసనలకు పిలుపునివ్వడంతో తాము నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి ముగిసే వరకు ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. పండగల సమయంలో నిరసనల కారణంగా మార్కెట్లలో రద్దీ తగ్గి, వ్యాపారాలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
అక్టోబర్ 16న సీజేపీ కన్నాట్ప్లేస్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. దీని వల్ల ఢిల్లీలోని సుమారు 20 లక్షల మంది వ్యాపారులపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. కన్నాట్ ప్లేస్, జన్పథ్, ఖాన్ మార్కెట్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో నిరసనల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలగవచ్చని CTI ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read
ఇదిలా ఉంటే, అక్టోబర్ 10 నాటి సీజేపీ నిరసనల వల్ల ఢిల్లీలో లాక్డౌన్ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని CTI పేర్కొంది. ఆ రోజు మార్కెట్కు జనాలు రాకపోవడం వల్ల సుమారు రూ. 2000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. నవరాత్రులు, దీపావళి వ్యాపారాలపై నిరసనల ప్రభావం పడుతోందని తెలిపింది. నిరసనల వల్ల రోడ్లు బ్లాక్ చేస్తే వినియోగదారులు షాపింగ్కు రాకపోవచ్చని పేర్కొంది.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..