Delhi Radiologist Dials Online Number Loses 25K In Honey Trap: అతడు ఒక రేడియాలజిస్ట్.. ఒంటరిగా ఉన్న తాను శారీరక సుఖం కోసం ఆన్‌లైన్‌లో ఓ వేశ్య కోసం వెతికాడు. ఒక నంబర్ దొరగ్గానే ఫోన్ కాల్ చేశాడు. దెబ్బకు రూ.25 వేలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఒక ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆసుపత్రిలో బాధితుడు రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్నాడు. శారీరక సుఖం పొందడం కోసం.. ఆన్‌లైన్‌లో కాల్ గర్ల్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతనికి ఒక నంబర్ దొరగ్గా.. దానికి ఫోన్ చేశాడు. అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తులు.. తమ వద్ద అందమైన అమ్మాయిలు ఉన్నారని ఊరించారు. దాంతో టెంప్ట్ అయిన అతగాడు.. వాళ్లతో కొంత మొత్తానికి డీల్ కుదుర్చుకున్నాడు. ఒక ప్రాంతంలో కలుసుకుందామని మాట్లాడుకున్నారు.
లొకేషన్‌లో బాధితుడు వేచి చూస్తుండగా.. ఒక కారులో అమ్మాయితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. తొలుత మాట మాట కలిపి.. తమ కారులో కూర్చోవాల్సిందిగా బాధితుడ్ని బలవంతం పెట్టారు. అనంతరం తమ అకౌంట్‌కి రూ.25 వేలు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా బెదిరించారు. వాళ్లను చూసి భయపడిపోయిన బాధితుడు.. మరో దారి లేక రూ.25 వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత మరో రూ.10 వేలు కూడా ఇవ్వమని డిమాండ్ చేశారు. లేకపోతే అత్యాచారం కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. తన వద్ద ఇక డబ్బులు లేవని, తనని విడిచిపెట్టమని ఆ రేడియాలజిస్ట్ వేడుకున్నాడు. దీంతో వాళ్లు బాధితుడ్ని రోడ్‌సైడ్ వదిలేసి.. వాళ్లు కారులో పరారయ్యారు. దారుణంగా మోసపోయిన బాధితుడు.. ఓటమిని అంగీకరించకుండా, పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తనని బెదిరించి, డబ్బులు దోచుకున్న వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Mithila Palkar: ఓయ్.. పొట్టి న్యూడుల్స్.. మరి ఇంత అందంగా ఉండకూడదు తెలుసా
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఐసీపీ సెక్షన్ 365 (కిడ్నాప్), 384 (దోపిడీ), 34 (కామన్ ఇంటెన్షన్)ల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు ఆ నలుగురు ఆచూకీ కనుగొని, వారిని అదుపులోకి చేశారు. నిందితుల పేర్లను పవన్, మోహిత్, సునీల్, దీప్షికాలుగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇన్వెస్టిగేషన్ మొదలైన వెంటనే వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు.