వివాహేతర సంబంధంపై జరిగిన వివాదం ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ ఘటనలో, రామ్ నగర్ ప్రాంతంలో బహిరంగంగానే ఒక గర్భిణీ ఆమె ప్రేమికుడు పొడిచి చంపగా, ఆమె భర్త అతన్ని హత్య చేశాడు.
Read Also: smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా..
పూర్తి వివారల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. షాలిని, ఆకాశ్ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మళ్లీ ప్రెగ్నెన్సీతో ఉంది.షాలిని, ఆకాశ్ కు గతంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆమె తన భర్త పిల్లలను వదిలేసి.. తన ప్రియుడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ప్రియుడు అష్షుకి, షాలినికి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వెంటనే అష్షుని వదిలి.. ఆమె భర్త దగ్గరకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె గర్భిణి. అయితే ఆకాష్ షాలిని కుతుబ్ రోడ్ వద్ద తన తల్లిని కలవడానికి వెళ్ళినప్పుడు అష్షు ఆమెపై కత్తితో దాడిచేశాడు.దీంతో ఆమె భర్త అతడిని అడ్డుకొని అష్షుపై దాడి చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో.. రక్త స్రావం జరిగి భార్య, ప్రియుడు చనిపోయారు. ప్రస్తుతం భర్తపరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also:Honey Trap: మరిదినే ట్రాప్ చేసిన వదిన.. రూ.10 లక్షలు డిమాండ్..
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. త్వరలోనే ఈ కేసుపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.
