Site icon NTV Telugu

Delhi: తనపై మొరిగిందని కుక్కతో సహా ముగ్గురిపై దాడి

Delhi Dog Incident

Delhi Dog Incident

పక్కింటి వారి కుక్క తనపై మొరిగిందనే కోపంతో కుక్కతో, ముగ్గురిపై దాడి చేసిన ఘటన ఢిల్లీలోని పశ్ఛిమ విహార్ లో చోటు చేసుకుంది. ఇనుప రాడ్ తో కుటుంబంలోని ముగ్గురి వ్యక్తుల్ని తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగకుండా కుక్కను కూడా కొట్టాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

Read Also:Government of Tamil Nadu: క‌మ‌ల్ కు నోటీసులు.. ఎందుకంటే?

పూర్తి వివరాల్లోకి వెళితే ధరమ్ వీర్ దహియా సోమవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న సమయంలో పొరుగున ఉన్న రక్షిత్ కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క అతనిపై మొరిగింది. దీంతో ఆగ్రహించిన ధరమ్ వీర్ కుక్కను తోక పట్టుకుని దూరంగా నెట్టాడు. దీంతో కుక్క ధరమ్ వీర్ ను కరిచింది. కుక్క యజమాని దాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ధరమ్ వీర్, రక్షిత్ తో పాటు అతని కుటుంబానికి చెందిన ఓ మహిళతో పాటు, ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి వచ్చిన మరో వ్యక్తిపై రాడ్ తో దాడి చేశాడు.

ఈ ఘటనపై రక్షిత్ పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీతో పాటు జంతువుల క్రూరత్వ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

 

Exit mobile version