Delhi Man Cheated By Instagram Girlfriend Who Turned Up As Boy: ఆన్‌లైన్‌లో ఓ అమ్మాయి పరిచయమైతే చాలు.. అసలు ఆ ఐడీ అమ్మాయిదేనా? కాదా? అని నిర్ధారించుకోకుండానే అబ్బాయిలు వారితో మాట్లాడేందుకు ఎగబడుతుంటారు. కాస్త చనువుగా మాట్లాడితే చాలు, ఇక వారికి దాసోహమైపోతారు. ఏం చేయడానికైనా సిద్ధమైపోతారు. చివరికి న్యూడ్ ఫోటోలు పంపించడానికి కూడా వెనుకాడరు. దీన్ని అలుసుగా తీసుకొని.. కొందరు ఆగంతకులు అబ్బాయిల్ని దోచేసుకుంటున్నారు. అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, అబ్బాయిలకు వల వేసి, వారిని తమ వలలో పడేసి, భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Coromandel Express : ఒడిశా రైలు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ప్రయాణికులెవరూ లేరు
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువతి పరిచయం అయ్యింది. ఆమె ఫోటోలు చూసి ఫిదా అయిన అతగాడు.. ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత.. ఆ అమ్మాయి ఓసారి న్యూడ్ ఫోటోలు పంపమని అడిగింది. ఆ వ్యక్తి ముందు, వెనక ఆలోచించకుండా.. వెంటనే న్యూడ్ ఫోటోలు పంపించాడు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్ వెలుగుచూసింది. ఆ అమ్మాయి అతడ్ని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. ఆ న్యూడ్ ఫోటోలు ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించింది. తన పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో.. ఆ వ్యక్తి ఆమె అకౌంట్‌లో రూ.21,600 ఐదు దఫాల్లో వేశాడు. ఇంకా ఆ యువతి డబ్బులు అడుగుతూనే ఉండటంతో.. ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనని ఓ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Nitin Gopi: ఇండస్ట్రీలో విషాదం.. కన్నడ స్టార్ నటుడు హఠాన్మరణం
పోలీసులు కేసు నమోదు చేసి, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఏ అకౌంట్‌లో డబ్బులు పంపించాడో, ఆ వివరాల్ని సేకరించారు. అలాగే, ఆ యువతి ఇన్‌స్టా ఐడీని కూడా తీసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా.. మొత్తానికి ఆ అమ్మాయి ఎక్కడుందో పసిగట్టారు. ఎప్పుడైతే లొకేషన్‌కి వెళ్లారో, అక్కడ పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయే మరో నిజం తెలిసింది. అసలు ఆ చాటింగ్, బ్లాక్‌మెయిల్ చేసింది అమ్మాయి కాదు.. అబ్బాయి అని! బీహార్‌కి చెందిన మహమ్మద్ అమన్ అనే యువకుడు.. షాహీన్ బాగ్‌లో ఉంటూ, ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడని తేలింది. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. డబ్బుల కోసమే ఇన్‌స్టాలో అమ్మాయిల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, అబ్బాయిలకు వల వేస్తుంటానని పేర్కొన్నారు. ఇలాంటి పాడు పనులతో అతగాడు రూ.33 లక్షలు పోగేసినట్టు తేలింది.