Man Beating Woman: ఢిల్లీలో దారుణం.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Man Beating A Woman Forcing Her To Sit In Car Near: దేశ రాజధాని ఢిల్లీలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులోనే ఓ యువతి పట్ల ఒక యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆమెని దుర్భషలాడుతూ.. బలవంతంగా కారులో ఎక్కించాడు. అంతేకాదు.. ఆమెపై దాడి కూడా చేశాడు. ఆ కారులో ఉన్న డ్రైవర్ గానీ, మరో ప్రయాణికుడు గానీ.. అతడ్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. చుట్టుపక్కల ఉన్నవారు సైతం చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగోల్‌పురి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన చోటు చేసుకుంది.
Harrasment : తల్లి కాదు రాక్షసి.. బాలికపై అమానుషంగా దాడి
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. దీనిని సుమోటోగా తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వీడియోలో కనిపించిన నంబర్ ప్లేట్ ఆధారంగా.. కారు, డ్రైవర్ జాడ కనుగొన్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ కమిషనర్ హరేందర్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నంబర్ ప్లేట్ ఆధారంగా కారు, డ్రైవర్ని ట్రేస్ చేయగలిగాం. ప్రాథమిక విచారణలో భాగంగా.. ఉబర్ ద్వారా ఈ కారుని రోహిణి ప్రాంతం నుంచి వికాస్పురికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి బుక్ చేసినట్టు తేలింది. ప్రయాణంలో ఆ ముగ్గురి మధ్య గొడవ జరగడంతో.. మార్గమధ్యంలో ఆ యువతి కారు దిగింది. అప్పుడు ఆ యువకుడు దుర్భాషలాడుతూ, కారులో ఆమెను ఎక్కించాడు’’ అని వివరించారు.
Ajith: భార్యను వదిలి అజిత్ సీక్రెట్ ఎఫైర్.. ఎవరామె ?
ఆ క్యాబ్ డ్రైవర్ గురుగ్రామ్‌కి చెందిన వాడిగా గుర్తించామని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు అక్కడికి ఓ బృందాన్ని పంపించామని హరేందర్ సింగ్ పేర్కొన్నారు. మరికొన్ని పోలీసు బృందాలను సైతం రంగంలోకి దింపినట్టు ఆయన వెల్లడించాడు. ఎలాగైనా నిందితుల ఆచూకీ తెలుసుకొని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ‘ఢిల్లీలో అమ్మాయిలకు సేఫ్టీ లేదా? నడిరోడ్డుపై ఈ ఘోరం జరుగుతుంటే అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవ్వరు ముందుకు రాలేదు’’ అంటూ మండిపడుతున్నారు.
#SOS | Just Now at Mangolpuri Flyover towards Peeragarhi Chowk.@DelhiPolice @LtGovDelhi @dcpouter @DCWDelhi @dtptraffic pic.twitter.com/ukmVc7Tu1v
— Vishnu Joshi (@thevishnujoshi) March 18, 2023
తాజావార్తలు
-
Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!