NTV Telugu Site icon

Man Beating Woman: ఢిల్లీలో దారుణం.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి..

Man Forcing Woman

Man Forcing Woman

Delhi Man Beating A Woman Forcing Her To Sit In Car Near: దేశ రాజధాని ఢిల్లీలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులోనే ఓ యువతి పట్ల ఒక యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆమెని దుర్భషలాడుతూ.. బలవంతంగా కారులో ఎక్కించాడు. అంతేకాదు.. ఆమెపై దాడి కూడా చేశాడు. ఆ కారులో ఉన్న డ్రైవర్ గానీ, మరో ప్రయాణికుడు గానీ.. అతడ్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. చుట్టుపక్కల ఉన్నవారు సైతం చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగోల్‌పురి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన చోటు చేసుకుంది.

Harrasment : తల్లి కాదు రాక్షసి.. బాలికపై అమానుషంగా దాడి

ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. దీనిని సుమోటోగా తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వీడియోలో కనిపించిన నంబర్ ప్లేట్ ఆధారంగా.. కారు, డ్రైవర్ జాడ కనుగొన్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ కమిషనర్ హరేందర్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నంబర్ ప్లేట్ ఆధారంగా కారు, డ్రైవర్‌ని ట్రేస్ చేయగలిగాం. ప్రాథమిక విచారణలో భాగంగా.. ఉబర్ ద్వారా ఈ కారుని రోహిణి ప్రాంతం నుంచి వికాస్‌పురికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి బుక్ చేసినట్టు తేలింది. ప్రయాణంలో ఆ ముగ్గురి మధ్య గొడవ జరగడంతో.. మార్గమధ్యంలో ఆ యువతి కారు దిగింది. అప్పుడు ఆ యువకుడు దుర్భాషలాడుతూ, కారులో ఆమెను ఎక్కించాడు’’ అని వివరించారు.

Ajith: భార్యను వదిలి అజిత్ సీక్రెట్ ఎఫైర్.. ఎవరామె ?

ఆ క్యాబ్ డ్రైవర్ గురుగ్రామ్‌కి చెందిన వాడిగా గుర్తించామని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు అక్కడికి ఓ బృందాన్ని పంపించామని హరేందర్ సింగ్ పేర్కొన్నారు. మరికొన్ని పోలీసు బృందాలను సైతం రంగంలోకి దింపినట్టు ఆయన వెల్లడించాడు. ఎలాగైనా నిందితుల ఆచూకీ తెలుసుకొని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ‘ఢిల్లీలో అమ్మాయిలకు సేఫ్టీ లేదా? నడిరోడ్డుపై ఈ ఘోరం జరుగుతుంటే అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవ్వరు ముందుకు రాలేదు’’ అంటూ మండిపడుతున్నారు.

Show comments