ఈనెల 8న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మహీంద్రా థార్ కారు ప్రమాదంలో మహిళ చనిపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత మహిళా ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక వీడియో పోస్ట్ చేసింది. చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. చనిపోయినట్లు వస్తున్న వదంతులను ఆపాలని కోరింది.
ఇది కూడా చదవండి: PM Modi: 2 ఏళ్ల తర్వాత తొలిసారి మణిపూర్‌లో అడుగుపెట్టిన మోడీ
ఘజియాబాద్‌కు చెందిన 29 ఏళ్ల మాని పవార్ అనే మహిళ.. తన భర్త ప్రదీప్‌తో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లోని కారు షోరూమ్‌కు సోమవారం సాయంత్రం 5గంటలకు వెళ్లింది. అనంతరం రూ.27 లక్షల ఖరీదైన మహీంద్రా థార్‌ను కొనుగోలు చేసింది. అయితే షోరూమ్ లోపలే పూజ నిర్వహించింది. అనంతరం టైర్ కింద నిమ్మకాయ తొక్కించడానికి డ్రైవింగ్ సీటులో కూర్చుంది. కారు స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ మీద కాలు వేసి బలంగా తొక్కింది. అంతే వెంటనే గాజు గోడను దూసుకుని కింద పడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి తల్లకిందులుగా కారు పడిపోయింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం సమీపంలోని మాలిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే తాజాగా బాధిత మహిళ చనిపోయిందని పుకార్లు వస్తున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను సజీవంగానే ఉన్నానని.. వదంతులు ఆపాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: UK: యూకేలో ఘోరం.. సిక్కు యువతిపై అత్యాచారం.. నీ దేశానికి వెళ్లాలంటూ వార్నింగ్
కొంత మంది లైక్‌లు, వ్యూస్ కోసమే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని.. కేవలం అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని.. అంతమాత్రాన చనిపోయారని ఎలా పుకార్లు సృష్టిస్తారని మండిపడింది. మహిళకు ఎముక విరిగిపోయిందని.. ముక్కు విరిగిపోయిందని.. ప్రస్తుతం ఆ మహిళ చనిపోయిందని ఇలా లేని పోని వార్తలు ఎందుకు సృష్టిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వదంతులను తోసిపుచ్చడానికే ఈ వీడియో చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది.
दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg
— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025
