Site icon NTV Telugu

ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడగింపు

Delhi Lockdown

దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం “లాక్ డౌన్” పొడిగించారు సిఎం కేజ్రీవాల్. ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుందన్నారు. ఇక నుంచి కఠినమైన “లాక్ డౌన్” నిబంధనలు అమలు చేస్తామని… మే 10 వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు రద్దు కానున్నాయని సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. “మెడికల్ ఆక్సిజన్” అందుబాటు పరిస్థితి నిలకడగా ఉందని… దేశ రాజధానిలో కొత్తగా 17,364 “కోవిడ్” కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. 24 గంటల్లో ఢిల్లీలో 333 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ఇక అటు ఉత్తర ప్రదేశ్ లోనూ మే 17 వరకు లాక్ డౌన్ ఉండనుంది. ఈ మేరకు యూపీ సర్కార్ ఇవాళ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version