Site icon NTV Telugu

ఢిల్లీలో లాక్ డౌన్ మళ్ళీ పొడిగింపు… కేసులు తగ్గితే… 

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.  లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  పాజిటివిటి రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ను సడలిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది.  దీంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  మే 31 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.  అప్పటి వరకు కేసులు తగ్గుముఖం పట్టి, మరణాల సంఖ్య తగ్గిపోయి కంట్రోల్ లో ఉంటె లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది.  ఒకవేళ ఇలానే ఉంటె లాక్ డౌన్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది.  

Exit mobile version