Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను ఈడీ విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కు అయి 5 శాతం నుంచి 12 శాతం మార్జిన్ పెంచినట్లుగా తేలింది. ఆధారాలు దొరక్కుండా అన్ని డిజిటల్ ఫోన్లను ధ్వంసం చేశారు. ఓబెరాయ్ హోటల్ కేంద్రంగా ఇవన్నీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి కీలక డిజిటల్ సాక్ష్యాలను మాయం చేశారు. లిక్కర్ స్కాం సమయంలో 14 ఫోన్లను ధ్వంసం చేశారని తేలింది. దర్యాప్త సంస్థల సోదాల్లో ఒక ఫోన్ మాత్రమే సీజ్ చేశారు. ఇంటరాగేషన్ లో మరోరెండు ఫోన్లను సీజ్ చేశారు అధికారులు.
ఢిల్లీ లెఫ్టినెంగ్ గవర్నర్ ఫిర్యాదు చేసిన వెంటనే 8 నెలలుగా వాడుతున్న ఫోన్ ను సిసోడియా గతేడాది జూలైలో ధ్వంసం చేశారు. ఎల్జీ ఫిర్యాదు చేసిన తర్వాత నుంచే ఫోన్లను ధ్వంసం చేశారు. అక్రమ నగదు చలామణికి సంబంధించిన అనేక ఆధారాలు ఈ ఫోన్లలో ఉన్నాయి. ఇతరుల పేర్లలో సిమ్ కార్డులను ఈ ఫోన్లలో వాడారు. అయితే ఇదంతా రొటీన్ ప్రాక్టీస్ లో భాగంగానే చేసినట్లు సిసోడియా ఈడీకి సమాధానం చెప్పాడు. అయితే 6 నుంచి 12 శాతం కమిషన్ పెంచాలని మంత్రుల బృందం సమావేశంలో చర్చలు ఏం జరగలేదని, కమిషన్ పెంచాలన్న నిర్ణయంలో మద్యం శాఖ పాత్ర ఏమీ లేదని అధికారులు తెలిపారు.
Read Also: Virat Kohli: నాటు నాటు స్టెప్ వేసిన విరాట్.. నువ్వు కూడా హీరో అయిపో అన్నా
సిసోడియా పర్సనల్ కంప్యూటర్ నుంచి జీఓఎం నోటను డౌన్లోడ్ చేసినట్లు, అందులో 5 శాతం కమిషన్ గురించి మాత్రమే ఉందని, సౌత్ గ్రూర్ కుమ్మక్కు కావడంతో విచిత్రంగా నాలుగు రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయని విచారణలో తేలింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి మనీష్ సిసోడియా తన కార్యదర్శిని పలిచి, ఆయన చేతికి 12 శాతం మార్జిన్ పెంచుతున్న మద్యం పాలసీ డ్రాఫ్ట్ రిపోర్టు ఇచ్చారని తేలింది. ఇది 2021 మార్చి 15 నుంచి 19 మధ్యలో జరిగింది.
సౌత్ గ్రూపు సభ్యులు అదే సమయంలో ఒబెరాయ్ హోటల్లో గతేడాది మార్చ్ 14 నుంచి 17 వరకు అక్కడే మకాం వేశారు. ఓబెరాయ్ హోటల్ బిజినెస్ సెంటర్లో 36 పేజీల మద్యం ముసాయిదా విధానం ప్రింట్ అవుట్ తీశారని, ఈ ముసాయిదాలోనే 5 నుంచి 12 శాతం మార్జిన్ పెంచారని తేలింది. సౌత్ గ్రూపుతో మనీష్ సిసోడియా కుమ్మక్కు అయ్యారనే దానికి ఇదే పెద్ద సాక్ష్యం అని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. క్యాబినెట్ కు వెళ్లడానికి రెండు రోజుల ముందు ఫైనల్ మద్యం పాలసీ సౌత్ గ్రూప్ సభ్యుల మొబైల్స్ లో దొరికింది. మాజీ ఎక్సైజ్ కమిషనర్ రాహుల్ సింగ్, అమిత్ అరోరాలను ఈ నెల 20న విచారణకు ఈడీ పిలిచింది. డిప్యూటీ సీఎం సెక్రటరీ అరవింద్ ను మార్చి 21న విచారణకు పిలిచారు. వీరందరిని మనీష్ సిసోడియాతో కలిపి ఇంటరాగేషన్ చేయనున్నారు.