Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
- పెర్నోడ్ రికార్డ్ కు ఢిల్లీలో భారీ ఎదురుదెబ్బ
- అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం
- రూ.3,000 కోట్ల పన్ను బకాయిల ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెర్నోడ్ రికార్డ్ కు ఢిల్లీలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ వంటి ప్రముఖ మద్యం బ్రాండ్ల విక్రయాలకు అనుమతి ఇవ్వాలంటూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో 2023 నుంచి కొనసాగుతున్న ఆ కంపెనీపై ఢిల్లీ మార్కెట్ నిషేధం యథాతథంగా కొనసాగనుంది. 2021 ఢిల్లీ మద్యం విధాన కేసులో కంపెనీ పేరు రావడంతో ఈ వివాదం మొదలైంది.
ఈడీ ఆరోపణలు.. రిటైలర్లతో కుమ్మక్కు కేసు
Also Read
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
2021లో తమ మార్కెట్ వాటాను అక్రమంగా పెంచుకునేందుకు రిటైలర్లతో కుమ్మక్కయ్యిందని Enforcement Directorate (ED) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పెర్నోడ్ రికార్డ్ మద్యం లైసెన్స్ దరఖాస్తును ఢిల్లీ అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న సంస్థను తిరిగి వ్యాపారం చేసేందుకు అనుమతించాలా వద్దా అన్నదే ప్రధాన వివాదంగా మారింది. అయితే, హైకోర్టు తీర్పుపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
రూ.3,000 కోట్ల పన్ను బకాయిల ఆరోపణ
మద్యం విధాన వివాదంతో పాటు, పెర్నోడ్ రికార్డ్ భారత పన్ను అధికారులతో మరో పెద్ద న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం, కంపెనీ తన స్కాచ్ విస్కీ దిగుమతుల అసలు విలువ, వయస్సు, కూర్పు వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువను తక్కువగా చూపించడం ద్వారా కస్టమ్స్ సుంకాలు తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీపై సుమారు రూ.2,996 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం.
కోడ్ పేర్లతో కస్టమ్స్ అధికారులను తప్పుదారి పట్టించారా?
దర్యాప్తు సంస్థల ప్రకారం, కంపెనీ తన దిగుమతి చేసుకున్న మాల్ట్లకు కొత్త కోడ్ పేర్లు ఉపయోగించిందని తెలుస్తోంది. దీని వల్ల కస్టమ్స్ అధికారులు అసలు ఉత్పత్తులను గుర్తించడం కష్టమైందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, దిగుమతి చేసిన స్కాచ్ కాన్సంట్రేట్ అసలు కూర్పు, వయస్సు వంటి వివరాలను కూడా కంపెనీ పూర్తిగా వెల్లడించలేదని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను పెర్నోడ్ ఇండియా పూర్తిగా ఖండించింది. తాము అన్ని చట్టపరమైన నిబంధనలను పాటించామని, న్యాయపరంగా పోరాడుతున్నామని సంస్థ స్పష్టం చేసింది.
67% తక్కువగా చూపిన దిగుమతి విలువ?
దర్యాప్తు నివేదికల ప్రకారం, కంపెనీ తన స్కాచ్ కాన్సంట్రేట్ దిగుమతుల విలువను సుమారు 67.49% వరకు తక్కువగా చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారతదేశంలో అమల్లో ఉన్న 150% కస్టమ్స్ సుంకం నుంచి భారీగా లాభపడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. Royal Stag వంటి ప్రముఖ విస్కీ బ్రాండ్లు ఈ దిగుమతి చేసిన స్కాచ్ కాన్సంట్రేట్‌ను నీరు, కారామెల్ వంటి పదార్థాలతో కలిపి తయారు చేస్తారని తెలుస్తోంది.
కేసులో ఓడితే రూ.5,700 కోట్లకుపైగా భారం
భారతదేశం పెర్నోడ్ రికార్డ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ఈ వివాదానికి ముందు కంపెనీ భారత అమ్మకాలలో దాదాపు 5% వాటా ఒక్క ఢిల్లీ నుంచే వచ్చేది. ప్రస్తుతం కంపెనీపై సుమారు రూ.3,000 కోట్ల ట్యాక్స్ లయబిలిటీ ఉన్నట్లు కోర్టు రికార్డులు సూచిస్తున్నాయి. అయితే, ఈ కేసులో కంపెనీ ఓడిపోతే జరిమానాలతో కలిపి మొత్తం భారం రూ.5,725 కోట్లకు మించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
విస్కీ తయారీ ఎలా జరుగుతుంది?
పెర్నోడ్ రికార్డ్ వంటి కంపెనీలు విదేశాల నుంచి పెద్ద మొత్తంలో స్కాచ్ కాన్సంట్రేట్‌ను దిగుమతి చేసుకుంటాయి. ఈ కాన్సంట్రేట్‌ను నీరు, న్యూట్రల్ స్పిరిట్స్, కారామెల్ వంటి పదార్థాలతో కలిపి విస్కీ బ్రాండ్లను తయారు చేస్తారు. ఈ స్కాచ్ కాన్సంట్రేట్ దిగుమతులపై భారతదేశంలో 150% వరకు భారీ కస్టమ్స్ సుంకం విధిస్తారు.
తాజావార్తలు
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!