Groom Dance: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికొడుకు చేసిన డ్యాన్స్ ఏకంగా వివాహం రద్దు అయ్యేలా చేసింది. ప్రముఖ బాలీవుడ్ సాంగ్ ‘‘చోలీకే పీచే క్యాహై’’కి వరుడు డ్యాన్స్ చేయడం వధువు తండ్రికి నచ్చలేదు. దీంతో అతడు పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే, పెళ్లికొడుకు పెళ్లి మండపానికి ఊరేగింపుగా వచ్చారు. అయితే, అదే సమయంలో అతడి స్నేహితులు డ్యాన్స్ చేయాల్సిందిగా వరుడిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశాడు. ఇదంతా చూసిన వధువు తండ్రికి నచ్చలేదు. దీంతో వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.
Read Also: Waqf bill: రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..
అతడు చేసిన పని అనుచితంగా ఉందని, వరుడి చర్యలు తమ కుటుంబ విలువల్ని అవమానించాయని చెబుతూ వధువు తండ్రి వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు. ఈ పరిణామాలతో షాకైన వధువు కన్నీటిపర్యంతమైంది. వరుడు, వధువు తండ్రికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడి ప్రయత్నాలు ఫలించలేదు. వివాహం రద్దు అయిన తర్వాత కూడా వధువు తండ్రి కోపం తగ్గలేదు. తన కుమార్తెతో వరుడి కుటుంబం ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని తెగేసి చెప్పాడు.
ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేశారు. ‘‘బహుశా నేను చూసిన అత్యంత ఫన్నీ ప్రకటన ఇది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘మామగారు సరైన నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే, అతను ఈ నృత్యాన్ని ప్రతిరోజూ చూడవలసి ఉండేది.’’ అని మరొకరు స్పందించారు. ఇది అరెంజ్ మ్యారేజ్ కాదు, ఎలిమినేషన్ రౌండ్ అని మరొకరు వ్యాఖ్యానించారు.
probably the funniest ad placement i’ve seen till date 😂 pic.twitter.com/a189IFuRPP
— Xavier Uncle (@xavierunclelite) January 30, 2025