దేశరాజధాని ప్రాంతం కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. కాలుష్య నివారణకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. కొన్ని పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ రాజాధానిలో “భారత్ స్టేజ్” (బిఎస్)-4 డీజిల్, బిఎస్-3 పెట్రోల్ వాహానాలపై నిషేధం కొనసాగించనుంది. రేపు ఢిల్లీ లోని ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించింది. 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. రైల్వే, రహదారులు, హైవేలు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులపై విధించిన నిషేధం ఎత్తివేసింది.
Read Also: Virat Kohli: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కోహ్లీ.. కెరీర్‌లోనే తొలిసారి
అయితే, ప్రైవేట్ కట్టడాల నిర్మాణాలపై నిషేధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లో ట్రక్కుల ప్రవేశంపై విధించిన నిషేధం ఎత్తివేసింది. దేశ రాజధాని ప్రాంతం ఎన్.సి.ఆర్) లో కాలుష్యం వల్ల ఆరోగ్యంపై ఉండే స్పల్పకాలిక, దీర్ఘ కాలిక ప్రభావంపై ఢిల్లీ వాసుల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎప్పటికప్పుడు సమీక్షించి కట్టుదిట్టమైన చర్యలు, నిర్ణయాలు కుంటామని భరోసా ఇస్తుంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.
గత కొంతకాలంగా ప్రతి ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధమయిన వ్యాధులకు గురవుతున్నారని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వే తేల్చింది. గాలి కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్వాస సంబంధమయిన సమస్యలతో ప్రతి కుటుంబం సతమతం అవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వినియోగించిన బాణసంచా వల్ల కాలుష్యం స్థాయి పెరిగిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంటున్నారు.
Read Also: MP R Krishnaiah: రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు
