NTV Telugu Site icon

Swati Maliwal Case: సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం..

Swati Maliwal Case

Swati Maliwal Case

Swati Maliwal Case: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిన్న స్వాతి మలివాల్ తనపై జరిగిన దాడిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై దాడి చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. గురువారం ఆమె నివాసానికి వెళ్లిని పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

Read Also: Amit Shah: సోనియా గాంధీ, లాలూ తమ కొడుకులను పీఎం, సీఎం చేయాలని అనుకుంటున్నారు..

ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం సాక్ష్యాలు సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. దాడికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో నిక్షిప్తం అయ్యే అవకాశం ఉండటంతో వాటిని ఫోరెన్సి్క్ టీం సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం.. అకారణంగా బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడినట్లు స్వాతి మలివాల్ ఆరోపించారు. తనను ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, కడుపులో, ఛాతీ భాగాల్లో కాలితో తన్నారని ఆమె పేర్కొంది.

ముఖ్యంగా దాడి జరిగిన లివింగ్ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోనున్నారు. మరోవైపు దాడికి పాల్పడిన కేజ్రీవాల్ పీఎ బిభవ్ కుమార్ జాతీయ మహిళా కమిషన్ ముందు ఈ రోజు హాజరుకావాల్సి ఉన్నా హాజరుకాలేదు. దీంతో రెండోసారి అతడికి ఉమెన్ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఆప్‌పై బీజేపీ ధ్వజమెత్తుతోంది. కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తోంది.