NTV Telugu Site icon

సింగ‌పూర్ నుంచే థ‌ర్డ్ వేవ్ ముప్పు..! రాక‌పోక‌లు వెంట‌నే నిలిపివేయండి..

Kejriwal

భార‌త్‌ను క‌రోనా సెకండ్ వేవ్ అల్ల క‌ల్లోలం చేస్తోంది.. దాని దెబ్బ‌కు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.. మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్ ముప్పు కూడా లేక‌పోలేద‌ని.. అది చిన్నారుల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని ఇప్ప‌టికే వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో.. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. సింగ‌పూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ కొత్త‌ స్ట్రెయిన్ ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌… భార‌త్ లో థ‌ర్డ్ వేవ్ వ్యాప్తిలో సింగ‌పూర్ కోవిడ్ స్ట్రెయిన్ విరుచుకుప‌డ‌వ‌చ్చ‌ని అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు.. దీనిని క‌ట్ట‌డి చేయ‌డానికి సింగ‌పూర్ నుంచి విమాన రాక‌పోక‌ల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని సూచించిన ఢిల్లీ సీఎం.. చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.. సింగ‌పూర్ స్ట్రెయిన్ చిన్నారుల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నార‌ని.. ఇది థ‌ర్డ్ వేవ్ రూపంలో భార‌త్ ను తాకే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.