Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

Delhi Building Collapse

Delhi Building Collapse

Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సైదులాజాబ్‌ ప్రాంతంలో ఒక ఐదు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలోనే భారీ భవనం కుప్పలుగా మారిపోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన ధూళి, కేకలతో అల్లకల్లోలంగా మారింది. భవనం ఉన్నట్టుండి కూలిపోవడంతో ఆ సమయంలో లోపల ఉన్న నివాసితులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. భవనం కూలిన శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంఘటనా స్థలంలో బాధితుల బంధువుల ఆర్తనాదాలు, కేకలతో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమాచారం అందిన వెంటనే మెహ్రౌలీ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు మరియు ఫైర్ సిబ్బంది భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాలను వేగంగా తొలగించి, వాటి కింద ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ప్రాణాలతో రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను తరలించేందుకు వీలుగా ఘటనా స్థలంలో అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. భవనం కూలడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

×
×
Ad