Site icon NTV Telugu

Delhi Airport : 11 కోట్ల విలువైన కోకైన్ తరలింపుకు కిలాడీ లేడీ స్కెచ్ ..భారీగా డ్రగ్స్ పట్టివేత… ఢిల్లీ అంతర్జాతీయ

Delhi Airport Drugs

Delhi Airport Drugs

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. డ్రగ్స్ తరలింపులపై అధికారులు డేగ కళ్లతో చెక్కింగులు చేస్తున్నా అక్రమ తరలింపులు కొనసాగుతునే ఉన్నాయి.. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరోసారి అధికారుల తనిఖీల్లో భారీగా కోకైన్ పట్టుకున్నారు.. ఈరోజు జరిగిన తనిఖీల్లో ఎయిర్ పోర్టులో 11 కోట్ల విలువ చేసే 734 గ్రాముల కోకైన్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బెంగుళూరు DRI అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇథియోపియా లేడి కిలాడీ ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు తమ స్టైల్లో విచారించగ భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు..

కొకైన్ తరలించడానికి కొత్తగా స్కెచ్ వేసింది ఇథియోపియా ప్రయాణికురాలు. తెల్లటి పౌడర్ తో కూడిన కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి ఏకంగా 75 క్యాప్సూల్స్ మింగింది కిలాడీ లేడి.. అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో అసలు విషయాన్ని బయటకు కక్కింది..కిలాడీ లేడీ అతి తెలివితేటల్ని సైతం బోల్తా కొట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కొకైన్ తరలింపును పట్టించింది..

బయట ఎక్కడ పెట్టుకున్న అధికారులు పట్టుకోవడంతో ఆమె తెలివిని ప్రదర్శించింది.. 11 కోట్ల విలువ చేసే 734 గ్రాముల కొకైన్ ను తెల్లటి పౌడర్ తో కూడిన కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి ఏకంగా 75 క్యాప్సూల్స్ రూపంలోకి మార్చింది.. ఆ తర్వాత వాటిని మింగింది.. అయితే ఆమె ప్రవర్తన పై అనుమానం రావడంతో అధికారులు ఆమెను విచారించారు.. ఎంతకీ నోరు విప్పక పోవడంతో తమ స్టైల్లో విచారణ జరిపారు.. పొట్టలో దాచిన డ్రగ్స్ గుట్టును రట్టు బయట పెట్టారు.. అనంతరం ఆమెకు శస్త్రచికిత్స చికిత్స చేసి కొకైన్ ను బయటకు వైద్యులు తీశారు..లేడి కిలాడీ పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.. ఇంకా కోకైన్ ఎక్కడ ఉంది అనే అంశం పై మహిళను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version