Site icon NTV Telugu

Dehradun: యువతీయువకుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్

Dehradun

Dehradun

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో యువతీయువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు-ఇద్దరు యువతుల మధ్య ఫైటింగ్ సాగింది. పిడిగుద్డులు, బెల్టుతో కొట్టుకోవడం కనిపించింది. ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయిని తన్నడం కనిపించింది. యువకుడు కూడా ఎదురుదాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Aghori: బయటపడుతున్న లీలలు.. అఘోరిపై కేసు నమోదు..

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని సహస్త్రధార పర్యాటక ప్రాంతంలో యువతీయువకుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఎందుకు దాడి చేసుకున్నారో మాత్రం కారణం తెలియదు. కానీ శనివారం నుంచి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీడియోలో ఉన్న బైక్ నెంబర్ల ఆధారంగా రాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశారు. ప్రమోద్ సింగ్, ఆకాష్ సింగ్, గౌరవ్ రావత్‌లను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారంతా 20 ఏళ్ల వయసు వారని.. పౌరి గర్హ్వాల్ జిల్లా నివాసితులని పోలీసులు తెలిపారు. కొట్లాటకు కారణమేంటో పోలీసులు కూడా తెలియజేయలేదు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

అయితే ఈ వీడియోపై నెటిజన్ల స్పందిస్తూ.. పురుషులను అరెస్ట్ చేసి.. మహిళలను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీస్తున్నారు. వీడియోలో యువతులు కూడా దాడి చేశారు కదా? ఏంటి పక్షపాతం అని నిలదీస్తున్నారు. అమ్మాయిలు కొట్టి.. దుర్భాసలాడినట్లు వీడియోలో ఉన్న కూడా అరెస్ట్ చేయారా? అని ప్రశ్నిస్తున్నారు.

 

Exit mobile version