NTV Telugu Site icon

Amritpal Singh: డెహ్రాడూన్, హరిద్వార్ హై అలర్ట్.. నేపాల్‌కు పారిపోయేందుకు ప్లాన్..

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. గత ఏడు రోజులుగా అతను తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానాలో ఆయనకు ఓ మహిళా ఆశ్రయం ఇచ్చిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడితో పాటు అతడి సన్నిహితుడు పప్పల్ ప్రీత్ సింగ్ కు ఆశ్రయం ఇచ్చిన మహిళను అరెస్ట్ చేశారు. తలపాగా తీసేసి తన రూపాన్ని మార్చుకుని, గొడుగు చాటున వెళ్తున్న ఫోటో ప్రస్తుతం పోలీసులకు చిక్కింది.

Read Also: Naresh Pavitra Lokesh: ఓరీవారి… మళ్లీ పెళ్లి అనేది సినిమానా?

ఇదిలా ఉంటే ఎలాగైనా నేపాల్ మీదుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ అధికారులు అంచానా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నేపాల్ బోర్డర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల అమృత్ పాల్ సింగ్ ఫోటోలను అంటించారు. ఇదిలా ఉంటే పంజాబ్ దాటి హర్యానాకు చేరిన అమృత్ పాల్ సింగ్ ఉత్తరాఖండ్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యటు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.

పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ కేసులో పంజాబ్ పోలీసులు 207 మందిని అరెస్ట్ చేశారు. 30 మంది నేరపూరిత చర్యలకు పాల్పడినట్లు పంజాప్ ఐజీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ గురువారం తెలిపారు. చివరిసారిగా హర్యానాలోని కురుక్షేత్రలో బల్జీత్ కౌర్ అనే మహిళ అమృత్ పాల్ సింగ్ కు ఆశ్రయం ఇచ్చినట్లు తేలింది. ఈమె గత రెండేళ్ల నుంచి ఆయన సన్నిహితుడు పప్పల్ ప్రీత్ సింగ్ తో టచ్ లో ఉంది. ప్రస్తుతం బల్జీత్ కౌర్ ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేసి, పంజాబ్ పోలీసులకు అప్పగించారు.