Site icon NTV Telugu

Bus Accident: నదిలో పడ్డ పెళ్లి బస్సు.. 32 మంది మృతి

Uttarakhand Bus Accident

Uttarakhand Bus Accident

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 25 మంది నీటిలో మునిగి చనిపోయారు. రిఖినికల్‌-బీరోఖల్‌ రహదారిపై వెళ్తున్న పెళ్లి బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతున నదిలో పడిపోయింది. ఈ ఘటనలో నదిలో ఇప్పటివరకు 32 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. 20 మంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్ సభ్యులు ఇతరుల కోసం వెతుకుతున్నారు. ఈ బస్సులో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

అయితే ఈ ఘటన మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సమాచారంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే, చీకటి కారణంగా, వారు సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు తమ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఉపయోగించి దృశ్యాన్ని వెలిగించి లోయలో పడిపోయిన వారి కోసం వెతికారు.
Rama Prabha: ‘హాస్యరాణి’ రమాప్రభ

Exit mobile version